Sunday, November 16, 2025
Homeకేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ..

కేఎల్‌ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ..

- Advertisement -

మూడు శాటిలైట్లు విజయవంతంగా ప్రయోగం
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ యూనివర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లను విజయవంతంగా నింగిలోకి పంపించారు.ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ (ఈసీఈ) విభాగానికి చెందిన 34 మంది విద్యార్థులు సీహెచ్‌ కావ్య, కె. శరత్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ ఉపగ్రహాలను రూపకల్పన చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ క్యాంపస్‌లోని క్రికెట్‌ మైదానాన్ని లాంచ్‌ప్యాడ్‌గా ఉపయోగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు.

ప్రయోగించిన మూడు ఉపగ్రహాల ప్రత్యేకతలివే
కేఎల్‌ జేఏసీ
క్రెడిట్‌ కార్డు పరిమాణంలో పికో బెలూన్‌ నమూనాతో రూపొందించిన ఈ శాటిలైట్‌ అత్యల్ప విద్యా ఉపగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.ఇది మూడు నెలల పాటు ట్రోపోస్పియర్‌ పొరలో సంచరిస్తుంది.
గాలి నాణ్యత పరిశోధనలు, టెలిమెట్రీ పరీక్షలు మరియు శాటిలైట్‌ లింక్‌ క్వాలిటీ అంచనాల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపుదిద్దారు.
కేఎల్‌ శాట్‌-2
హైబ్రిడ్‌ ఏరోస్విఫ్ట్‌ వీటీఓఎల్‌ ఫ్లైట్‌ కమ్‌ మాడ్యూల్‌తో ఉన్న ఈ ఉపగ్రహాన్ని డ్రోన్‌ సహాయంతో ప్రయోగించారు. స్పెక్ట్రోమీటర్‌ ద్వారా పర్యావరణ సంబంధిత డేటాను సేకరిస్తుంది.

కాన్‌శాట్‌
ఇన్‌స్పేస్‌, ఇస్రో, ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) సంయుక్తంగా ఃమేక్‌ ఇన్‌ ఇండియాః ఃఆత్మనిర్భర్‌ భారత్‌ః కార్యక్రమాల భాగంగా నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికైన ఉపగ్రహంగా ఇది గుర్తింపు పొందింది.వాతావరణ పరిస్థితులు, వాయు నాణ్యతపై అధ్యయనం చేయడానికి దీనిని రూపొందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు