Monday, February 17, 2025
Homeజిల్లాలునెల్లూరువిద్యార్థికి ట్రై సైకిల్ వితరణ చేసిన ఉపాధ్యాయులు

విద్యార్థికి ట్రై సైకిల్ వితరణ చేసిన ఉపాధ్యాయులు

సంతోషం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తూర్పు పోలనేనిపాలెం నందు నాలుగో తరగతి చదువుతున్నటువంటి బొగ్గవరపు నాగ వెంకట భవ్య శ్రీ ,విభిన్న ప్రతిభావంతురాలుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నలదలపూరు పాఠశాల లో పనిచేయుచున్న ప్రధానోపాధ్యాయులు బి. మాధవరావు , గణిత ఉపాధ్యాయులు కే. సుధాకర్ రావు ,ఆంగ్ల ఉపాధ్యాయుడు టీ ఎస్ ఆర్ మూర్తి , సైన్సు ఉపాధ్యాయులు కె .గిరిబాబు , సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు ఎస్ .రమేష్ అందరూ కలిసి 6000 రూపాయల విలువచేసే ఒక ట్రై సైకిల్ ను పాప తల్లిదండ్రులు అయిన బొగ్గవరపు వెంకటేశ్వర్లు- అలివేలమ్మ లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.శామ్యూల్ గారి సమక్షంలో దాతలు అందజేయడం జరిగినది .దాతలకు పాప తల్లిదండ్రులు,మరియు పాఠశాల సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గోపాల్, సుబ్బారావు ,సతీష్ మరియు జనార్ధనలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు