విశాలాంధ్ర ధర్మవరం; అమ్మ రూపమే తెలుగు భాష అని ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తెలుగు ఉపన్యాసకులు డా.ఎస్.షమీఉల్లా ఆధ్వర్యం లో కార్యక్రమం జరిగింది అని తెలిపారు. భాషా సాంస్కృతిక వైవిధ్యం మరియు బహు భాషల ప్రాముఖ్యత గురించి విద్యార్థులలో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం జరుపుకోవడం సంప్రదాయం అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే అనేక భాషల యొక్క వైవిధ్యాన్ని, ప్రత్యేకతని; ఆ భాషలు మాట్లాడే వారి జీవితాలను వారి సంస్కృతులను గుర్తించడం లో కీలక పాత్ర పోషించే రోజు యిది అని తెలుపుతూ మన తెలుగు భాషను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు.
ఒక జాతి గుర్తింపులో , సంప్రదాయ జ్ఞానాన్ని కాపాడటంలో భాష కిటికీ లాంటిది. సామరస్యం,స్థిరమైన పురోగతి పెంపొందించడంలో భాష ప్రముఖపాత్ర పోషిస్తుంది అని ఇతర వక్తలు అభిప్రాయపడ్డారు.. ప్రతి ఒక్కరూ తమ తమ మాతృ భాషలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డా॥ ఎస్.చిట్టెమ్మ,డా.బి. త్రివేణి, డా.ఎస్ షమీవుల్లా ,ఎ.కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి , యం. పుష్పావతి, బి. ఆనందు, ఎం. సరస్వతి, జి. మీనా, జి. ధనుంజయ బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు.
అమ్మ రూపమే తెలుగు భాష.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
RELATED ARTICLES