బాధిత ఆశా వర్కర్‌ను పరామర్శించిన ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; మండలంలోని ముచ్చు రామి గ్రామంలో వైసీపీ వర్గీయుడైన పెద్ద పక్కీ రప్ప దౌర్జన్యానికి దిగి, ఆశా వర్కర్ లక్ష్మీదేవి పై కట్టెతో దాడి చేయడంతో ఆమె చేయి విరిగి, తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు , ధర్మవరం దేవి నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను పరామర్శించారు.ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ బాధితురాలికి అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు. పోలీస్ అధికారులతో మాట్లాడి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరు నేరం చేసిన వదలకూడదు అని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీపడదని హరీష్ బాబు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి , మల్లికార్జున ,తుంపర్తి నాగరాజు ,పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.బాధిత ఆశా వర్కర్‌ను పరామర్శించిన ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు