విశాలాంధ్ర ధర్మవరం;; స్పెయిన్ దేశస్తులు నిర్వహించిన పదవ అల్ట్రా మరాతాస్ రన్ కార్యక్రమానికి చిగిచెర్ల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆర్ టి టి సంస్థ ఆధ్వర్యంలో స్పెయిన్ దేశస్థులు నిర్వహించిన ఈ కార్యక్రమం చిగిచెర్ల గ్రామం మీదుగా కొనసాగింది. ఆర్డిటి రీజినల్ డైరెక్టర్ ప్రమీల ఏటీఎల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామస్తులు తప్పట్లతో ఘన స్వాగతం పలికారు. ఈ రన్ లో స్పెయిన్ దేశస్తులు మన్నీలా నుంచి చికిచెర్ల ముష్టురు మీదుగా బత్తలపల్లికి చేరుకున్నారు. తొలుత చిగిచెర్లలో మహిళలు విద్యార్థులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్లేకార్డులు పట్టుకొని హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా స్పెయిన్ దేశస్తులు వెళ్లే రహదారి మార్గంలో రంగురంగుల ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించి స్వాగతం పలుకుతూ వారికి నమస్కారాలు చేస్తూ కరచాలనముతో తో ముందుకు సాగడముతో ఈ రన్ కార్యక్రమం విజయవంతమైంది. స్పెయిన్ దేశస్తులు మాట్లాడుతూ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ రన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెయిన్ దేశస్తులతో పాటు ఆర్డిటి సిబ్బంది, మహిళా సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి.
స్పెయిన్ బృందానికి ఘన స్వాగతం పలికిన చిగీచెర్ల గ్రామస్తులు
RELATED ARTICLES