Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించాలి

ఇన్సాఫ్ మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్

విశాలాంధ్ర అనంతపురం : కేంద్ర ప్రవేశపెడుతున్న వక్ఫ్ సవరణ బిల్లును ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాలని ఇన్సాఫ్ మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ పేర్కొన్నారు. భారత కమ్యునిస్టు పార్టీ యొక్క మైనారిటీ వింగ్ ఁఇన్సాఫ్ఁ అనంతపురం నగర సమితి ఆధ్వర్యంలో ,స్థానిక జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ…బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని ప్యానెల్, నవంబర్ 25న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి వారంలో వక్ఫ్ బిల్లుపై తుది నివేదికను ప్రవేశపెట్టనున్నది అన్నారు. 16 మంది ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, ఎన్‌డిఎ కేంద్ర ప్రభుత్వానికి కీలక భాగస్వామ్యం అన్నారు. భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ా ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు పాత్ర కీలకమైనదన్నారు. కేంద్ర ప్రభుత్వ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకత తెలిపితే మోడీ ప్రభుత్వం పరిగణ లోకి తీసుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. కేరళ ప్రభుత్వం కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు తమ వ్యతిరేకత తెలిపిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. ఏపీలో మైనారిటీలకు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం దాదాపు 4వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు తమ వ్యతిరేకత తెలిపితే మైనారిటీ హృదయాల్లో చంద్రబాబు నాయుడు నిలిచిపోతారన్నారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు అల్లి పీరా , అధ్యక్షులు చాంద్ బాషా, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు