ప్రధాని అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ్ శర్మ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చెరువు కట్ట -శివాలయం వీధిలో గల శ్రీ కాశీ విశాలాక్షి సహిత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో ఈనెల 22వ తేదీ శనివారం సాయంత్రం 6:30 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ వేడుకలు, అనంతరం 23వ తేదీ ఆదివారం సాయంత్రం పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు, గురు స్వామి, ప్రధాన అర్చకులు, బ్రహ్మశ్రీ కైప ద్వారకనాథ శర్మ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం 1360 సంవత్సరం(మైసూర్ ఒడియా రాజుల ఆధ్వర్యంలో) నిర్మించబడిందని తెలిపారు. ప్రతి సంవత్సరం మా ఆలయంలో దాతలు సహకారంతో, భక్తాదుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈనెల 22వ తేదీన కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తాదులు, దాతల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. ఇదే రోజు పెద్ద ఎత్తున అన్నసంతర్పణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. తదుపరి 23వ తేదీ ఆదివారం సాయంత్రం స్వామివారిలను పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈనెల 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ యజమానులు శివదీక్ష మాలధారణ కమిటీ, కళ్యాణోత్సవ ఉభయ దాతలు ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. కావున ఈ కార్యక్రమాలకు భక్తాదులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవ వేడుకలు..
RELATED ARTICLES