Wednesday, January 22, 2025
Homeజిల్లాలుఅనంతపురంపాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

-మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ

విశాలాంధ్ర-రాప్తాడు : పాడి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ అన్నారు. మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం ద్వారా రామాంజనేయులు రాయితీతో నిర్మించుకున్న గోకులం షెడ్డును బుధవారం ఎంపీడీఓ బి.విజయలక్ష్మి, ఈఓఆర్డీ ఆనంద్ ప్రసాద్, ఏపీఓ సావిత్రి, ఈసీ మురళీ, టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనాతో కలిసి ప్రారంభించారు. ధర్మవరపు మురళీ మాట్లాడుతూ
పశుపోషకులకు 90 శాతం, జీవాలు, కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీ ఇచ్చి నిర్మిస్తోందన్నారు. దీంతో పాడిపరిశ్రమకు పూర్వవైభవం వచ్చి పాడి రైతుల కళ్లలో ఆనందం కనపడుతోందన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు. అనంతరం పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా గ్రామంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఏ పరందామ, మాజీ కన్వీనర్ సాకే నారాయణస్వామి, తెలుగు యువత రాజశేఖర్ రెడ్డి, భోగినేపల్లి సీసీ రాము, ఫీల్డ్ అసిస్టెంట్ ఓబిలేసు, నాయకులు తలారి ఓబిలేసు, బ్రహ్మానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు