విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు జర్నలిస్టు కాలనీలో డేగల రవికుమార్ యొక్క టు వీలర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా అద్దం టీవీ విలేఖరి డేగల రవి మాట్లాడుతూ 2016లో హోండా షోరూమ్ లో తాను హోండా టూ వీలర్ ను కొనుగోలు చేయడం జరిగిందని, అప్పటినుండి నేను రాత్రిపూట ఇంటి వద్దనే మోటార్ సైకిల్ ని ఉంచేవాడినని తెలిపారు. రోజువారి మాదిరిగానే నా టూవీలర్లకు లాక్ చేసి ఇంటిలో పడుకున్నానని తెలిపారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో తాను నిద్ర లేచి బయట చూడగా నా టూ వీలర్ కనపడకపోవడంతో టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు నా మోటార్ సైకిల్ ను దొంగలించుకొని పోయినారని తెలిపారు. డేగల రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని టూ టౌన్ పోలీసులు తెలిపారు.