Thursday, April 3, 2025
Homeజిల్లాలుఅనంతపురంమాలల సంక్షేమ ఆర్థికాభివృద్ధే తమ లక్ష్యం

మాలల సంక్షేమ ఆర్థికాభివృద్ధే తమ లక్ష్యం

విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా ) : ఆంధ్రప్రదేశ్ మాలల సంక్షేమ, ఆర్థికాభివృద్దే తమ లక్ష్యం అని ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ కొంకరి కమలమ్మ పేర్కొన్నారు. గురువారం అమరావతిలోని తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో తాడిపత్రికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఆంధ్ర ప్రదేశ్ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టర్ గా కొంకరి కమలమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొంకరి కమలమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా, నాయకురాలుగా తాను చేసిన కష్టాన్ని గుర్తించి డైరెక్టర్ హోదాలో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తనకు మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు రావడానికి సహకరించిన మున్సిపల్ చైర్మన్ జెసి. ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే జెసి. అస్మిత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు అని, జెసి కుటుంబీకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. మాలలు ఆర్థిక, సంక్షేమ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారులో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అసంతృప్తితో ఉండకుండా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలని కార్యకర్తలకు, నాయకులకు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు