విశాలాంధ్ర కొవ్వూరు దొమ్మేరు సొసైటీ నందు రైతులకు వివిధ పంటలలో వాడవలసిన నత్రజని అలాగే అధిక మోతాదులో నత్రజని వాడడం వల్ల వచ్చే నష్టాలు గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు రైతులకు వివరించారు. ఆదివారం దొమ్మేరు సొసైటీలో నానో యూరియా గురించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు .నత్రజని యూరియా బస్తా రూపంలో వాడడం వల్ల మొక్కలకు 35 శాతం మాత్రమే ఉపయోగపడుతుందని మిగతాది 65శాతం వివిధ రూపాల్లో ఆవిరి అవుతుందని తెలియజేశారు. అలాగే పైపాటిగా నత్రజని నానో యూరియా స్ప్రేయింగ్ పద్ధతిలో వాడడం వల్ల 90శాతం వరకు మొక్కలకు ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే రైతులందరూ అవసరం మేరకు మాత్రమే యూరియా వాడాలని తెలియ చేసారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని యూరియా కొరత ఎక్కడా లేదని దొమ్మేరు సొసైటీలో పూర్తిస్థాయిలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు యూరియాకు బదులు నానో యూరియా వాడాలని పంటలకు నాన్న వీర 90 శాతం పని చేస్తుందని రైతులకు అవగాహన కల్పించారు .అలాగే జిల్లా కోపరేటివ్ అధికారి మాట్లాడుతూ అన్ని సహకార సంఘాలలో యూరియా అందుబాటులో ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి తాసిల్దార్ ఎం దుర్గాప్రసాద్ , దొమ్మేరు వైస్ ప్రెసిడెంట్ కలగర సుబ్బారావు .జిల్లా సహకార శాఖ అధికారి ముళ్ళపూడి వెంకట రమణ ,మండల వ్యవసాయ అధికారి గంగాధర్ దొమ్మేరు సొసైటి చైర్ పర్సన్ గారపాటి రామ కృష్ణ పర్సన్ సిద్ధగని సావిత్రమ్మ,పర్సన్ తోట ముద్దులు బాబు తెలుగుదేశం నాయకులు మురమళ్ళ సత్యనారాయణ, రంగారావు రైతులు మరియు సంఘ కార్యదర్శి కరిబండి ప్రసాద్ మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యూరియా అవసరమైన నిల్వలు ఉన్నాయి
- Advertisement -
RELATED ARTICLES


