విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామ ఎస్సీ కాలనీ లో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాసపు రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామంలో ఉన్న దళిత మహిళలు ఎదుర్కొంటున్న వివక్షతను గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉపాధి హామీ పనుల వద్ద బీసీలు వివక్షతను చూపిస్తున్నారని దళిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో రేగిడి మండల దళిత జేఏసీ అధ్యక్షులు తేగల మోహన్ మాట్లాడుతూ బూరాడ గ్రామంలో చాలా ఏళ్లుగా దళితులకు సంబంధించి స్మశాన వాటిక స్థలం లేక ఇబ్బంది పడుతున్నారని అనేకసార్లు కలెక్టర్ కి ఎమ్మార్వో కి విన్నవించిన ఫలితం లేదని తెలిపారు, సామాజిక భవనం శిథిలావస్థలో ఉందని భవనాన్ని మంజూరు చేయాలని విన్నవించారు, ఈ కార్యక్రమంలో బూరాడ గ్రామ విఆర్ఓ, మహిళలు పాల్గొన్నారు.