Friday, April 4, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే ఎంతో సంతృప్తి ఉంది

పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే ఎంతో సంతృప్తి ఉంది

శిబిరా క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం;; వేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలోనే ఎంతో సంతృప్తి ఉంది అని శిబిర క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని నేసే పేటలో గల తొగటవీధిలోని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో 109వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఉచిత వైద్య చికిత్స శిబిరములను దాతల సహాయ సహకారములతో నిర్వహించడం మాకెంతో గర్వించదగ్గ విషయమని తెలిపారు. నేటి శిబిరమునకు దాతలుగా కీర్తిశేషులు దాసరి ఓబులమ్మ, కీర్తిశేషులు దాసరి నారప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు దాసరి ప్రమీల, దాసరి మంజునాథ్ అండ్ సన్స్ వారు వ్యవహరించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సాయి స్వరూప్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ జైదీప్ నేత, డాక్టర్ విట్టల్, డాక్టర్ వినయ్ లు రోగులకు వైద్య చికిత్సలను అందిస్తూ ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 275 మందికి వైద్య చికిత్సలను అందిస్తూ ఒక నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా అందించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారందరికీ కూడా బీపీ ,షుగర్ వైద్య చికిత్సలను ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బంధనాదం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, బండి నాగరాజు, మేకల శివయ్య, మామిళ్ల అశ్వత నారాయణ, పెద్దకోట్ల విజయ్ ,పెద్ద కోట్ల భాస్కర్, కాచర్ల నారాయణస్వామి, ఆర్. రామచంద్ర, కౌన్సిలర్ కుండా చౌడయ్య, పవన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు