ఆలయ కమిటీ అధ్యక్షుడు వెంకటరమణ, శిబిరం చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర ధర్మవరం:: పేద ప్రజలకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు వెంకటరమణ, శిబిరం చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి) పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో, ఆలయ అభివృద్ధి కమిటీ సంఘం తరఫున 108వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ప్రతినెల ఇటువంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, దాతల సహాయ సహకారములతోనే నిర్వహించడంలో ఎంతో సంతోషం ఉంటుందని తెలిపారు. శిబిరదాతలుగా కీర్తిశేషులు వేల్పుల వెంకటమ్మ, కీర్తిశేషులు వేల్పుల బూసప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు వేల్పుల వెంకటేశు అండ్ సన్స్ వారు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన వైద్యులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప -దంత వైద్యులు, డాక్టర్ వెంకటేశ్వర్లు -చిన్నపిల్లల డాక్టరు, డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం -సర్జన్ హైదరాబాద్, దీవి జైతీపునేత గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లాప్రోస్కిపిక్ సర్జన్- హైదరాబాద్, డాక్టర్ ఎస్. విట్టల్, డాక్టర్ వినయ్ రోగులకు వైద్య చికిత్సలను అందిస్తూ, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను, నియమాలను తెలియజేయడం జరిగిందన్నారు. మొత్తం ఈ శిబిరంలో 290 మందికి వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బండి నాగరాజు, మామిళ్ళ సత్యనారాయణ తో పాటు బంధనాదం చిన్నికృష్ణ, పవన్, సుశీలమ్మ, పెద్దకోట్ల భాస్కర్, పెద్దకోట్ల విజయ్, తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు సేవలు చేయడంలోనే నిజమైన సంతృప్తి
RELATED ARTICLES