రూల్ పొజిషన్ ప్రకారం కోర్టు కేసులను పరిష్కారం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర -అనంతపురం : కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులకు జవాబుదారీతనం ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో కోర్టు కేసులపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసులకు సంబంధించి ఆయా శాఖల పరిధిలో నోడల్ అధికారులను నియమించడం జరిగిందని, కోర్టు కేసుల పరిష్కారంలో ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన టీమ్ లు ఎంత ముఖ్యమన్నారు. పరిపూర్ణంగా కోర్టు కేసులను పరిష్కారం చేయాలన్నారు. ప్రజలకు ఎక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్లడం జరుగుతుందని, అలా జరగరాదని, అధికారుల వద్ద కేసులు పరిష్కారం అవుతాయనే నమ్మకం కలగాలన్నారు. కోర్టు కేసులను చక్కగా డీల్ చేస్తే కార్యాలయంపై నమ్మకం కలుగుతుందని, కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరూ రూల్ పొజిషన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. న్యాయం చేయడానికి సమయం లేదని, న్యాయం కలగడం వల్ల వచ్చే సుఖం, నెమ్మది చాలా బాగుంటుందన్నారు. కోర్టు కేసులలో ఎవరెవరు కంటెంప్ట్ లో ఉంటారో వారికి వివరాలు తెలపాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రతిరోజు రూల్ పొజిషన్ చదవాలని, ప్రతిరోజు గంటసేపు కోర్టు కేసులపై సమయం కేటాయిస్తే, క్రమశిక్షణ చూపిస్తేనే ఆ శాఖలు బాగవతాయన్నారు. ప్రతి కోర్టు కేసుకు ఒక ఈ ఫైల్ జనరేట్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పకడ్బందీగా సమాచారం ఉండాలని, ఆయా శాఖల అధికారులు చాలా సీరియస్ గా కోర్టు కేసుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ ఎ.మాలోల, కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ వసంతలత, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, ఆయా శాఖల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.