Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదౌర్జన్యంగా మా స్థలములో ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారు..

దౌర్జన్యంగా మా స్థలములో ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారు..

స్థల యజమానులు పోలా వెంకటనారాయణ ,పోల రంగయ్య, పోలా ప్రభాకర్
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం మండల పరిధిలోని కొనుటూరు పొలంలో సర్వేనెంబర్ 546లో 2005లో 3. 5 ఎకరాలు పెన్సింగ్ ను అక్రమ దారులు ధ్వంసం చేశారని బాధితులు పోలా వెంకటనారాయణ, పూల రంగయ్య, పోలా ప్రభాకర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది ఇతరులతో కలిపి జిపి చేయించుకున్నామని స్థలంలోకి రావడం జరిగిందని, తాము కోర్టు నుంచి కమిషన్ వేయించి సర్వే చేయించుకోవాలని బోర్డును పాతడం జరిగిందన్నారు. తాము సబ్ డివిజన్ కూడా చేయించినా కూడా ఆ స్థలాన్ని కొందరు కబ్జా చేయాలని ఈనెల 5వ తేదీన కొందరు వచ్చి మా స్థలంలో వేసిన పెన్సింగ్లు బోర్డును జెసిపితో ధ్వంసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట ఆది ఈ స్థలాన్ని వేరే వారితో జిపి చేయించుకున్నారని ఆయన పంపితే ఇక్కడికి వచ్చామని చెప్పినట్లు బాధితులు తెలిపారు. అంతేకాకుండా మాపై బెదిరింపులు కూడా దిగడం జరిగిందని, ధ్వంసం చేసిన గస్తీ ఓంకార్ చంద్రశేఖర్ గోకుల గణేష్ కిరణ్ కుమార్ దస్తగిరి మనోహర్ వీరితోపాటు మరికొందరిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మంత్రి సత్య కుమార్ డిస్టిక్ కూడా తీసుకొని వెళ్తామని తెలిపారు. అన్ని ఆధారాలు మా మా దగ్గర ఉన్నాయని వారు తెలిపారు. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని బాధితులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు