దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో జరిగిన జైన మతపరమైన కార్యక్రమంలో భక్తుడి వేషంలో పాల్గొని సుమారు రూ.1.5 కోట్ల విలువైన బంగారు వస్తువులను అపహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భూషణ్ వర్మను ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్టు సోమవారం పోలీసులు వెల్లడించారు. ఈ భారీ చోరీ కేసును సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఆగస్టు 28 నుంచి ఎర్రకోట ప్రాంగణంలోని ఆగస్టు 15 పార్కులో జైనుల పవిత్ర పండుగ ాదశలక్షణ మహాపర్వ్ణ జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 3న భూషణ్ వర్మ భక్తుడి మాదిరిగా పంచెకట్టు ధరించి కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని పూజల కోసం ఉంచిన విలువైన వస్తువులను దొంగిలించాడు.


