తెలంగాణ శాసనసభ నుంచి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. సభను నడుపుతున్న తీరును నిరసిస్తూ ఆ పార్టీ సభ్యులు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిశాసనసభను నడపడంలో ప్రభుత్వం విఫలమైంది. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ఇది గాంధీభవన్ కాదు.. తెలంగాణ శాసనసభ్ణ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్ తరహాలో కాకుండా అసెంబ్లీని అసెంబ్లీగా నడపాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో కనీసం తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ ఇచ్చినా మాట్లాడుతుండగానే మైక్ కట్ చేస్తున్నారని ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండటం బాధాకరమని అన్నారు.