ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవుల షెడ్యూల్తో పాటు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండియర్లోకి ప్రవేశించే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. దీని అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
మే 31 వరకు సెలవులు
ఈ సెలవులు మే 31 వరకు కొనసాగుతాయి. తిరిగి జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండియర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇక విద్యార్థుల కోసం దసరా, సంక్రాంతి సెలవుల తేదీలను కూడా బోర్డు ప్రకటించింది. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 20 వరకు ఉండగా, 2027 జనవరి 9 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.


