Monday, May 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదేశ సమైక్యతను చాటాల్సిన సమయం ఇది

దేశ సమైక్యతను చాటాల్సిన సమయం ఇది

పాకిస్తాన్ కి మనం ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది

జవాన్ మురళీ నాయక్ శాంతి ర్యాలీలో పరిటాల శ్రీరామ్ పిలుపు

అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ ఆత్మ శాంతి కోసం ధర్మవరంలో కొవ్వొత్తుల ప్రదర్శన

పెద్ద ఎత్తున హాజరైన అన్ని వర్గాల ప్రజలు

విశాలాంధ్ర ధర్మవరం;ఇండియా-పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన దేశ సమైక్యతను చాటాల్సిన సమయం ఇది అని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని ధర్మవరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ధర్మవరంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. గాంధీనగర్ నుంచి పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన సాగింది. అక్కడ జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి.. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ
గోరంట్ల మండలం కల్లి తండా కు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో చనిపోవడం చాలా బాధాకరమన్నారు. 25 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలర్పించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సంధి నడిపి.. మళ్లీ కాల్పులు జరిపిందన్నారు. కచ్చితంగా ఇండియన్ ఆర్మీ వారికి గట్టి బుద్ధి చెబుతుందన్నారు. భారతదేశంలో అన్ని వర్గాలు, మతాలు, కులాల వారు సమైక్యంగా ఉన్నారన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చే సమయం ఇది అన్నారు. మనం శ్వేధం చిందిస్తే అందులో కొట్టుకుపోయే దేశం పాకిస్తాన్ అని.. వారికి మనమేంటో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. పాకిస్తాన్ తో పూర్తిస్థాయి యుద్ధం వస్తే ప్రతి ఇంటిలో ఒక సైనికుడు బయలుదేరాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు. మురళీ నాయక్ లాగా మరో సైనికుడు ప్రాణాలు కోల్పోకుండా మనకు విజయం అందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు