విశాలాంధ్ర- అనంతపురం : శ్రీకాకుళం జిల్లాలో జరగనున్న ఏఐవైఎఫ్ 22 వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర మహాసభల లోగో గోడ పత్రికలను శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ విడుదల చేశారు.
ఏ ఐ వై ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు కోట్రెష్ అధ్యక్షతన ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. నిరుద్యోగ భృతి 5000 ఇవ్వాలని వెనుక బడిన రాయలసీమ ప్రాంతల అభివృద్ధి కి తోడ్పాండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తామని చెప్పి జనవరి 17 తేదీ వచ్చిన ఇప్పటివరకు కూడా జాబ్ క్యాలెండర్ పై స్పష్టత ఇవ్వని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసే దిశగా అడుగులు వేస్తుంది అన్నారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి ఫిబ్రవరి 6, 7, 8,9 తేదీలలో శ్రీకాకుళం లో
సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఏఐవైఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ లు మాట్లాడుతూ
నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చిన తీవ్ర అన్యాయం జరుగుతుందని చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలు వలసలకు పోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని. రాష్ట్రంలో మంచినీళ్లు కొరత ఉందేమో గాని మందు కొరత లేదని యువత గంజాయి డ్రగ్స్ వాడకంలో తలను నాశనం చేసుకుంటున్నారని డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందిందన్నారు,యువతకు ఉపాధి దొరకకపోవడంతో దేశంలో ప్రతి రోజు 40 నుంచి 45మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి అని తెలిపారు. విద్య ,వైద్యం, ఉపాధి ,భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులు గా గుర్తించినా విద్య ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారంగా మారిందని వైద్యం మాఫియా వల్ల అందరికీ అందడంలేదని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు. నూతన పరిశ్రమలలో యువతకు ఉపాధి, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేయాలని కోరారు. రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలనీ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగ భృతి ఇవ్వాలని , ప్రభుత్వా శాఖల్లో ఖాళీ ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అన్నారు. ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు ,వివిధ సామాజిక ,ఆర్థిక రాజకీయ, నూతన పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. కియా పరిశ్రమల్లో 70 శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా కోశాధికారి శ్రీనివాస్ జిల్లా ఆఫీస్ బేరర్స్ ధను,కుళ్లాయ్ స్వామి దేవ వంశీ ఏ ఐ వై ఎఫ్ రాయదుర్గం తాలూక అధ్యక్షులు కుమార్ ఉరవకొండ మండల కార్యదర్మి నవీన్ బాబు నాగరాజు మొయిన్ తదితరులు పాల్గొన్నారు.