Monday, March 31, 2025
Homeఆంధ్రప్రదేశ్చీరాల, బాపట్ల మధ్యలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు: ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్

చీరాల, బాపట్ల మధ్యలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు: ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్

కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ స్కీం 2.0 ద్వారా మంజూరైన రూ.97.52 కోట్ల నిధులతో సూర్యలంక బీచ్‌లో అధునాతన సదుపాయాలు కల్పించి, మరింత సుందరంగా తీర్చిదిద్ది బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. శుక్రవారం బాపట్ల జిల్లా అవిడి గ్రామంలో మంత్రి కందుల దుర్గేశ్ వి వాటర్స్ వాటర్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటికే పీపీపీ విధానంలో పెట్టుబడులకు పలువురు ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికామన్నారు. అందులో భాగంగా వి రిసార్ట్స్ పేరుతో బాపట్లలో అధునాతనమైన రిసార్ట్స్ నిర్మించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాటర్ స్పోర్ట్స్ ప్రవేశపెట్టి, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేసి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నందుకు అధినేత సందీప్‌ను మంత్రి అభినందించారు.చాలా మంది రిసార్ట్స్ ఏర్పాటుకే పరిమితం అవుతారు కానీ ఇలాంటి యాక్టివిటీస్ ప్రవేశపెట్టడం అరుదన్నారు. త్వరలోనే చీరాల-బాపట్ల మధ్య ఉన్న ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్‌గా చేసేందుకు సన్నాహాలు చేస్తామని మంత్రి తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పర్యాటకానికి పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్ లకు పెద్దపీట వేస్తున్నామన్నారు. పర్యాటకులు ఏదైనా ఒక ప్రాంత పర్యటనకు వస్తే రెండు మూడు రోజులు గడిపేలా మౌలిక వసతులు కల్పించి, చుట్టూ ఉన్న ప్రాంతాలను సందర్శించేలా సర్క్యూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో టెంపుల్ టూరిజంతో పాటు బీచ్, అగ్రి, మెడికల్, అడ్వెంచర్, స్పోర్ట్స్, వెల్‌నెస్ తదితర విభిన్న టూరిజం ప్రక్రియలను ప్రవేశపెడుతున్నామన్నారు. తద్వారా రాష్ట్రానికి ఆదాయంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదం కలుగుతుందని మంత్రి దుర్గేశ్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు