విశాలాంధ్ర- వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని ఈస్ట్ పోలినేనిపాలెంలోని కెజీబివీ పాఠశాలలోని విద్యార్థులకు సాదారణ విద్యతో పాటు వృత్తి విద్య ట్రేడ్ పుడ్ ప్రాసిసింగ్ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ గోవర్థిని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ 10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఫస్ట్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రాం కొరకు కందుకూరు లోని డెలీషియా బేకరీకి వెళ్లడం జరిగిందని అన్నారు.రకరకాల కేక్ లు, జ్యూస్ లు,జామ్ ల తయారీ విధానం గురించి నేర్చుకొనుటకు, నైపుణ్యం పెంపొందించుటకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్ వి. కళ్యాణి, విద్యార్డులు తదితరులు పాల్గొన్నారు.