Thursday, November 21, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅటవీ శాఖ సిబ్బందికి అడవులు , జంతువులపై శిక్షణ కార్యక్రమం

అటవీ శాఖ సిబ్బందికి అడవులు , జంతువులపై శిక్షణ కార్యక్రమం

విశాలాంధ్ర పెనుకొండ (శ్రీ సత్య సాయి జిల్లా) : అటవీ శాఖ సిబ్బందికి అడవులు జంతువులపై శిక్షణ కార్యక్రమం శుక్రవారం అటవీ శాఖ కార్యాలయం నందు నిర్వహించారు సిబ్బందికి, ఎంబిఎస్, టైప్స్ అప్లికేషన్, వినియోగంపై శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ కార్యక్రమము మరియు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, శ్రీ సత్యసాయి జిల్లా అటవీశాఖాధికారి చక్రపాణి , తెలిపారు, ముఖ్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అటవీ స్థాయిలో తిరిగినప్పుడు అడవులను సంరక్షించుట మరియు అడవి జంతువులను గుర్తించుట వాటి పాదముద్రికలు, మరియు వెంట్రుకలు, వాటి యొక్క పిచ్చుకలు ద్వారా జంతువులను గుర్తించడం వాటిని సంరక్షించడం వాటిని ఉన్నతాధికారులకు తెలియజేయడానికి క్షేత్ర సిబ్బందికి అవగాహన కల్పించడానికి శ్రీశైలం బయో డైవర్సిటీ అధికారి ధనరాజ్ , పాల్గొని సిబ్బందికి శిక్షణ ఇచ్చారు, జంతువుల్ని ఎలా గుర్తించాలి, అనే వాటిపై ట్యాబ్ లో నమోదు చేయడం వంటి వాటిని శిక్షణ ద్వారా నేర్పించారు ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా నుంచి 55 మంది వరకు పాల్గొన్నట్లు చక్రపాణి తెలిపారు, ఈ కార్యక్రమంలోసబ్ డివిజనల్ అధికారి జిపి ఆనంద్ , మరియు వారి సిబ్బంది మరియు ,కదిరి ,బుక్కపట్నం, పెను కొండ అటువీ క్షేత్ర అధికారులు గుర్రప్ప ,యామిని సరస్వతి, శ్రీనివాస్ రెడ్డి ,మరియు డిప్యూటీ అటవీ క్షేత్ర అధికారులు శివరాం , హుసే నప్ప మరియు జిల్లా అటవీశాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు