విశాలాంధ్ర- అనంతపురం : ఐక్యరాజ్యసమితి అధికారికంగా 2025వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా (ఐ వై సి) మరియు సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలనే నినాదంలో నెలవారీ కార్యక్రమాలను నిర్దేశించగా, దీనిని పురస్కరించుకొని రాయలసీమ కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీలో మంగళవారం సమాచార హక్కు చట్టంపైన సహకార శాఖ సిబ్బందికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం సమాచారహక్కు పరిరక్షణ సంఘం, అనంతపురం వారిచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ అరుణ కుమారి, సమాచారహక్కు పరిరక్షణ చట్టము అనంతపురం జిల్లా అధ్యక్షులు ఏ.హోన్నూరప్ప, ఉపాధ్యక్షులు రామలింగయ్య మరియు సహకార సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం గురించి అవగాహన కల్పించారు.