విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి మైదానంలో 2 వ రోజు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య ( పి ఎం టి , పి ఈ టి ) పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ స్వీయ పర్యవేక్షణలో పారదర్శకంగా పీఎంటీ , పి ఈ టీ పరీక్షలు కొనసాగాయి. సిసికెమేరాల పర్యవేక్షణలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బంధీగా ఈ పరీక్షలు జరిగాయి. మంగళవారం తెల్లవారుజామునే అభ్యర్థులు స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానం చేరుకున్నారు. అభ్యర్ధులకు మొదటగా సర్టిఫికెట్స్ పరిశీలించారు. ఆతర్వాత… బయోమెట్రిక్ తీసుకున్నారు. తదనంతరం ఎత్తు, చాతీ వంటి ఫిజికల్ మెజర్ మెంట్స్ నిర్వహించారు. అనంతరం …పరీక్షలలో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహించారు. దేహ దారుఢ్య పరీక్షల దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆధునిక ఆర్ ఎఫ్ ఐ డి కంప్యూటరైజ్డ్ టెక్నాలజితో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ యావత్తు పారదర్శకంగా జరిగేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించారు. జిల్లా ఎస్పీ అక్కడే ఉంటూ స్వీయ పర్యవేక్షణ చేశారు. ఎదైనా సమస్యల పై అప్పీల్ చేసుకునే వారు రిక్విజేసేన్ రాసి ఇచ్చి జనవరి 17 వ తేదిన అప్పీలుకు రావాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు డి.వి.రమణమూర్తి, ఇలియాజ్ బాషా (ఏ.ఆర్ ), పలువురు డీఎస్పీలు, సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సైలు, ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, ఐటి కోర్ టీం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.