Thursday, January 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు

మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులు

యాంటీ లెప్రసి డే కార్యక్రమంలో భాగంగా నివాళులర్పించిన జిల్లా కుష్టు వ్యాధి విభాగ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్
విశాలాంధ్ర అనంతపురం : మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా యాంటీ లెప్రసి డే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లోని టి హెఛ్ వార్డ్ లో జిల్లా కుష్ఠు వ్యాధి విభాగం అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్, ఆర్ యం ఓ ,డా హేమలత గురువారం పాల్గొని జాతి పిత మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.అనంతరం కుష్ఠు వ్యాధి వల్ల అంగవైకల్యం కలిగిన వారికీ యం సి ఆర్ చెప్పులు పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా కుష్ఠు వ్యాధి విభాగం అధికారి డా అనుపమ జేమ్స్ మాట్లాడుతూ… ఈనెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 13 వ తేదీ వరకు 15 రోజులు పాటు ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని సచివాలయ ఏ యన్ యమ్ లు ఇతర సిబ్బంది తో కలిసి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలు ఆశాలు ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడి వర్కర్లు మేల్ వాలంటీర్లు ప్రతిజ్ఞ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి అని తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుని ఆరోగ్య సిబ్బందికి సహకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డా శివారెడ్డి , పి యం ఓ నాగన్న ,హెఛ్ ఈ ఓ. సత్యనారాయణ ,డిప్యూటీ హెఛ్ ఈ ఓ గంగాధర్ ,డి పి యం .లు తిప్పేస్వామి ,నీలకంఠ , ఓబులు , రామచంద్ర , రాముడు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు