ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;! పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి కార్యక్రమంలో భాగంగా వారికి ఘనంగా ఎంపీడీవో సాయి మనోహర్, సిబ్బంది అందరూ నివాళులర్పించారు. తదుపరి వారి చిత్రపటానికి పూలు వేసి అందరూ నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ ఒక భారతీయ రాజకీయ నాయకుడిగా మంచి గుర్తింపు పొందుతూ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందని తెలిపారు. సంజీవయ్య భారత దేశ రాష్ట్రానికి మొదటి దరిత ముఖ్యమంత్రి, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినారని తెలిపారు. దేశంలోనే ప్రముఖ న్యాయ సంస్థలలో ఒకటైన విశాఖపట్నంలోని దామోదరపు సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వాలయం ఆయన గౌరవార్థం పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా 2008 ఫిబ్రవరి 14న తపాలా బిళ్ళను కూడా విడుదల చేయడం జరిగిందని తెలిపారు. సంజీవయ్య ఖాళీ సమయాల్లో తెలుగులో సాహిత్య వ్యాసాలు కవిత్వం రాసేవారని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు ఘనంగా నివాళులు..
RELATED ARTICLES