ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్క్ కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం:: పుల్వామా దాడిలో మృతి చెందిన వీర సైనికులకు పట్టణంలోని ఆదర్శ సేవా సంఘం, ఆదర్శ పార్కు కమిటీ వారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని అధ్యక్షులు కృష్ణమూర్తి, చెన్న సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద అధిక సంఖ్యలో ప్రజలతో పాటు కమిటీ వారు పూలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవ ప్రార్థన చేశారు. అనంతరం కృష్ణమూర్తి,చెన్న సూర్య ప్రకాష్, మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను సంస్కరణ, గుర్తుంచుకోవలసిన అవసరం దేశ ప్రజలందరికీ ఉందని తెలిపారు. వీర జవానులు లేనిదే మనం లేము అని వారు గుర్తు చేశారు. పుల్వామా దాడి మన దేశానికి చీకటి రోజు అవుతుందని, ప్రాణ త్యాగం చేసిన వీర సైనికుల సేవలను స్మరించుకోవాలని తెలిపారు. అనంతరం పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అందుకే ఈరోజును బ్లాక్ డే గా పిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుద్దిటి నాగార్జున, నాగభూషణం, మారుతి కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పుల్వామా దాడిలో మృతి చెందిన వీర సైనికులకు ఘనంగా నివాళులు..
RELATED ARTICLES