Monday, February 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి కు ఘన నివాళులు

కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి కు ఘన నివాళులు

విశాలాంధ్ర ధర్మవరం;; కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి మరణం పట్ల బాధను వ్యక్తం చేస్తూ కామ్రేడ్ ఇంటి వద్దకు సిపిఎం, సిఐటియు నాయకులు వెళ్లి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న సిపిఎం పార్టీ నాయకులు ఎస్ హెచ్ భాష, ఏ మారుతి, సిఐటియు నాయకులు జెవి రమణ టి అయూబ్ ఖాన్ ఎల్ ఆదినారాయణ, ఎస్ రఫీ మాట్లాడుతూ కామ్రేడ్ బడాసుబ్ రెడ్డి గారు ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా దాదాపు 40 సంవత్సరాలుగా పనిచేస్తూ నిరంతరం రైతుల కోసం ప్రజల కోసం అనేక రకాల పోరాటాలు నిర్వహించి చివరి శ్వాస వరకు సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి బడా సుబ్బిరెడ్డి అని తెలిపారు.అనేక గ్రామీణ ప్రాంతాలలోని రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ రైతుల కోసం అనేక రకమైన పోరాటాలు నిర్వహించి నారని,పేదలకు ఇళ్ల స్థలాలు సాధించడంలో అనేక రకాల పోరాటాల నిర్వహించినాడని,, అనేక రకాల పోరాటాలు నిర్వహించిన కామ్రేడ్ బడా సుబ్బిరెడ్డి అనారోగ్య కారణాల వలన మరణించడంతో ఏపీ రైతు సంఘానికి పేదలకు తీరని లోటని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు