విక్రమ్ మిస్రీకి అండగా నేతలు, దౌత్యవేత్తలు
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తీవ్ర దూషణలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు, మాజీ దౌత్యవేత్తలు తీవ్రంగా స్పందిస్తూ ఆయనకు అండగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించినందుకు ఒక అధికారిని, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు అవగాహన కుదిరిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. తక్షణమే భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) ఒక అవగాహనకు వచ్చినట్టు మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే మిస్రీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది. షద్రోహి, షగద్దర్, షదేశద్రోహి వంటి పదజాలంతో ఆయనపై దూషణలకు దిగారు. మరికొందరు ఆయన కుమార్తెల పౌరసత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు.
ఈ ఆన్‌లైన్ దాడిని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. మిస్రీ వంటి షనిజాయితీపరుడు, కష్టపడి పనిచేసే అధికారిని కేవలం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసినందుకు దాడి చేయడం సరికాదని అన్నారు. షవిక్రమ్ మిస్రీ మన దేశం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్న నిజాయతీపరుడైన, కష్టపడి పనిచేసే దౌత్యవేత్త. మన ప్రభుత్వోద్యోగులు కార్యనిర్వాహక వర్గం కింద పనిచేస్తారనేది గుర్తుంచుకోవాలి. కార్యనిర్వాహక వర్గం లేదా దేశాన్ని నడుపుతున్న ఏ రాజకీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు వారిని నిందించకూడదు అని ఒవైసీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా మిస్రీ గౌరవాన్ని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆయన కేవలం సమాచారాన్ని అందించే వ్యక్తి మాత్రమేనని, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. షకొంతమంది సంఘ విద్రోహులు ఆ అధికారి, ఆయన కుటుంబంపై దూషణల విషయంలో అన్ని హద్దులు దాటుతున్నా బీజేపీ ప్రభుత్వం గానీ, మంత్రులు గానీ ఆయన గౌరవాన్ని కాపాడటానికి ముందుకు రావడం లేదు. అవాంఛనీయ పోస్టులు చేసే వారిపై చర్యల గురించి చర్చించడం లేదు అని అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో రాశారు.
మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమా మీనన్ రావు ఈ ఆన్‌లైన్ దుష్ప్రచారాన్ని షఅత్యంత సిగ్గుచేటు అని అభివర్ణించారు. ఇది షసభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను దాటింది అని ఆమె అన్నారు. వభారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటనపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఆయన కుటుంబాన్ని ట్రోల్ చేయడం చాలా దారుణం. అంకితభావంతో పనిచేసే దౌత్యవేత్తగా, మిస్రీ వృత్తి నైపుణ్యంతో, దృఢ సంకల్పంతో భారతదేశానికి సేవ చేశారు. ఆయనను కించపరచడానికి ఎలాంటి ఆస్కారం లేదు. ఆయన కుమార్తె వివరాలు బహిర్గతం చేయడం, ఆయన ఆప్తులను దూషించడం సభ్యతకు సంబంధించిన అన్ని హద్దులను దాటింది. ఈ విషపూరిత ద్వేషం ఆగాలి. మన దౌత్యవేత్తల వెనుక ఐక్యంగా నిలబడాలి, వారిని కించపరచకూడదువ అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.