Wednesday, May 21, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికాలో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ట్రంప్ శ్రీకారం

అమెరికాలో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు ట్రంప్ శ్రీకారం


ప్రాథమికంగా 25 బిలియన్ డాలర్లు, మొత్తం 175 బిలియన్ డాలర్ల వ్యయం అంచనా
అంతరిక్షం నుంచైనా క్షిపణులను ఛేదించేలా రూపకల్పన

అమెరికాను క్షిపణి దాడుల నుంచి సంరక్షించేందుకు ఉద్దేశించిన గోల్డెన్ డోమ్ అనే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రణాళికను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వైట్‌హౌస్‌లో ఆవిష్కరించారు. సుమారు మూడేళ్లలో ఈ వ్యవస్థను కార్యాచరణలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఁఎన్నికల ప్రచార సమయంలో అమెరికా ప్రజలకు అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చాను. ఈ రోజు, ఆ అత్యాధునిక వ్యవస్థ నిర్మాణాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించడం సంతోషంగా ఉందిఁ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఈ ప్రతిష్ఠాత్మక పథకానికి ప్రాథమికంగా 25 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే, దీని మొత్తం వ్యయం దాదాపు 175 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని ఆయన అంచనా వేశారు. ఁగోల్డెన్ డోమ్ పూర్తిగా నిర్మితమైన తర్వాత, ప్రపంచంలోని ఏ మూల నుంచి ప్రయోగించిన క్షిపణులనైనా, చివరికి అంతరిక్షం నుంచి ప్రయోగించినా సరే అడ్డుకోగలదు. మన దేశ విజయం, మనుగడకు ఇది చాలా ముఖ్యంఁ అని ట్రంప్ వివరించారు. ఈ ప్రయత్నానికి యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గెట్‌లీన్ నాయకత్వం వహిస్తారని, కెనడా కూడా ఇందులో భాగస్వామి కావడానికి ఆసక్తి చూపించిందని ఆయన తెలిపారు.

ట్రంప్ మొత్తం వ్యయాన్ని 175 బిలియన్ డాలర్లుగా పేర్కొనగా, కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) అంచనాల ప్రకారం, పరిమిత సంఖ్యలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి అంతరిక్ష ఆధారిత ఇంటర్‌సెప్టార్ల వ్యయం 20 ఏళ్లలో 161 బిలియన్ డాలర్ల నుంచి 542 బిలియన్ డాలర్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. గోల్డెన్ డోమ్ విస్తృత లక్ష్యాలను కలిగి ఉందని, ఁభూమి, సముద్రం, అంతరిక్షంలో అంతరిక్ష ఆధారిత సెన్సార్లు, ఇంటర్‌సెప్టార్లతో సహా తదుపరి తరం సాంకేతిక పరిజ్ఞానాలను మోహరిస్తుందిఁ అని ట్రంప్ చెప్పారు.

ట్రంప్‌తో పాటు పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ, ఁక్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్‌సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అవి సంప్రదాయమైనా లేదా అణ్వాయుధాలైనా సరే, మాతృభూమిని రక్షించడం ఈ వ్యవస్థ లక్ష్యంఁ అని వివరించారు.

ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు భిన్నమైనవి

ఇజ్రాయెల్ యొక్క ఁఐరన్ డోమ్ఁ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుండి ఁగోల్డెన్ డోమ్ఁ అనే పేరు వచ్చింది. 2011లో కార్యరూపం దాల్చినప్పటి నుండి ఐరన్ డోమ్ వేలాది స్వల్ప శ్రేణి రాకెట్ల వంటి వాటిని అడ్డుకుంది. అయితే, అమెరికా ఎదుర్కొంటున్న క్షిపణి ముప్పులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎదుర్కొనే స్వల్ప శ్రేణి ఆయుధాల కంటే చాలా భిన్నమైనవి. రష్యా, చైనాలు గోల్డెన్ డోమ్ ప్రణాళికను ఁతీవ్ర అస్థిరపరిచేదిఁగా అభివర్ణించాయి. ఇది అంతరిక్షాన్ని ఁయుద్ధభూమిఁగా మార్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.

ఏమిటీ గోల్డెన్ డోమ్

హైపర్‌సోనిక్, బాలిస్టిక్ క్షిపణుల వంటి అత్యాధునిక ముప్పుల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఈ భారీ రక్షణ వ్యవస్థను సిద్ధం చేస్తోంది. ఃగోల్డెన్ డోమ్ః పేరుతో నిర్మించ తలపెట్టిన ఈ అత్యాధునిక కవచం, అంతరిక్ష ఆధారిత సాంకేతికతతో పనిచేయనుంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఃఐరన్ డోమ్ః వ్యవస్థను ఉదాహరణగా చూపుతూ, అమెరికా భద్రతకు ఇలాంటి పటిష్టమైన వ్యవస్థ అవసరమని ట్రంప్ చెప్పారు.

ఃగోల్డెన్ డోమ్ః ఎలా పనిచేస్తుంది?

ఃగోల్డెన్ డోమ్ః వ్యవస్థ అమెరికాను బాలిస్టిక్, హైపర్‌సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి రక్షించడానికి రూపొందించబడింది. ఇది ప్రధానంగా అంతరిక్షంలో అమర్చే సెన్సార్లు, ఇంటర్‌సెప్టర్ల ద్వారా దాడులను ముందుగానే పసిగట్టి, వాటిని నిర్వీర్యం చేస్తుంది. దీనికి అదనంగా భూమిపై, నౌకాదళాల నుంచి కూడా రక్షణ వ్యవస్థలు తోడవుతాయి. వేగవంతమైన సమాచారం కోసం ఆధునిక కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను వినియోగిస్తారు. మధ్యప్రాచ్యంలో ఇటీవల జరిగిన సైనిక కార్యకలాపాల అనుభవాలు ఈ ప్రణాళిక రూపకల్పనకు దోహదపడ్డాయని యూఎస్ స్పేస్ ఫోర్స్ వైస్ చీఫ్ ఆఫ్ స్పేస్ ఆపరేషన్స్, జనరల్ మైఖేల్ గెట్‌లీన్ తెలిపారు.

ఐరన్ డోమ్తో గోల్డెన్ డోమ్ ఎలా భిన్నమైనది

ఇజ్రాయెల్ఐరన్ డోమ్ స్ఫూర్తితో గోల్డెన్ డోమ్ను రూపొందిస్తున్నప్పటికీ, ఈ రెండింటి లక్ష్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వేర్వేరు. ఐరన్ డోమ్ ప్రధానంగా ఇజ్రాయెల్‌పై ప్రయోగించే తక్కువ శ్రేణి రాకెట్లు, ఫిరంగి గుండ్లను అడ్డుకుంటుంది. దీనికి విరుద్ధంగా, గోల్డెన్ డోమ్ అమెరికా దేశం మొత్తానికి రక్షణ కల్పించేలా, అత్యాధునిక క్షిపణి దాడులను ఎదుర్కొనేలా రూపొందిస్తున్నారు. ఐరన్ డోమ్ భూస్థిత రాడార్లు, ఇంటర్‌సెప్టర్లపై ఆధారపడితే, గోల్డెన్ డోమ్ అంతరిక్ష ఆధారిత సెన్సార్లు, ఇంటర్‌సెప్షన్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు