Wednesday, January 22, 2025
Homeఅంతర్జాతీయంట్రంప్ మీమ్ కాయిన్ తుఫాన్.. ఒక్కరోజులో 10 వేలకు రూ.70 వేలొచ్చాయ్..!

ట్రంప్ మీమ్ కాయిన్ తుఫాన్.. ఒక్కరోజులో 10 వేలకు రూ.70 వేలొచ్చాయ్..!

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఒక రోజు ముందే సొంత క్రిప్టో కరెన్సీని మార్కెట్లోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. $TRUMP పేరుతో తీసుకొచ్చిన ఈ మీమ్ కాయిన్ దుమ్మురేపుతోంది. మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన 36 గంటల్లోనే రూ.10 వేల పెట్టుబడిని రూ.70 వేలు చేసింది. క్రిప్టో ఇన్వెస్టర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. లాంచ్ అయిన మూడు గంటల సమయంలోనే 300 శాతం పెరిగడంతో మార్కెట్ క్యాప్ 6 బిలియన్ డాలర్లు దాటినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.ఈ ట్రంప్ మీమ్ కాయిన్ లాంచ్ అయిన 36 గంటల్లో 600 శాతం పెరిగింది. రూ.10 వేలు పెట్టిన ఈకాయిన్ కొనుగోలు చేసిన వారికి రూ.70 వేలు వచ్చినట్లయింది. ఈ డిజిటల్ క్రిప్టో కరెన్సీ విక్రయాలను CICడిజిటల్ చేపడుతోంది. ట్రంప్ ఆర్గనైజేషన్‌కి ఇది అనుబంధ సంస్థ. ఈ టోకెన్ ప్రాథమి ధర ఒక్క కాయిన్‌కి 10 డాలర్లుగా నిర్ణయించారు. ఆదివారం మార్కెట్లు ముగిసే నాటికి అది 70 డాలర్లను తాకింది. అయితే, భారీగా పెరగడంతో చాలా మంది మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సోమవారం ఉదయం పడిపోయింది. మెలానియా ట్రంప్ మరో కాయిన్ మెలానియా కాయిన్ లాంచ్ తీసుకొస్తామని పోస్ట్ చేసిన క్రమంలో ఈ కాయిన్ విక్రయాలు భారీగా జరిగినట్లు తెలుస్తోంది.అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ సుమారు రూ.86.46 వద్ద ఉంది. ట్రంప్ మీమ్ కాయిన్ ప్రాథమిక ధర ఒక్కో కాయిన్‌కు 10 డాలర్లుగా నిర్ణయించారు. అప్పుడు రూ.10 వేలతో 11.56 ట్రంప్ మీమ్ కాయిన్స్ వస్తాయి. ప్రస్తుతం ఈ ట్రంప్ క్రిప్టో ధర 70 డాలర్ల వద్ద ఉంది. అంటే ఇప్పుడు ఆ పెట్టుబడి విలువ రూ.69,930గా ఉంటుంది.

మరోవైపు.. మొత్తంగా 100 కోట్ల టోకెన్లు తీసుకొస్తామని ట్రంప్ మీమ్ కాయిన్ జారీ చేసిన సంస్థ సీఐసీ డిజిటల్ తెలిపింది. ప్రారంభం రోజున 20 కోట్ల కాయిన్లు మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. మూడేళ్లలో దశల వారీగా 80 కోట్ల కాయిన్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. సీఐసీ డిజిటల్ ఎల్ఎల్‌సీ గతంలో ట్రంప్ బ్రాండ్‌తో పాదరక్షలు, సుంగద ద్రవ్యాల వంటి ఉత్పత్తులను విక్రయించింది. గతంలో ట్రంప్ పేరుతో బంగారు బూట్లు, వజ్రాల వాచీలు, బైబిళ్ల వంటివి విక్రయించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు