Homeఅంతర్జాతీయంహెచ్‌-1బీ వీసాపై ట్రంప్‌ కీలక ప్రకటన.. భారీ ఫీజుకు మద్దతు

హెచ్‌-1బీ వీసాపై ట్రంప్‌ కీలక ప్రకటన.. భారీ ఫీజుకు మద్దతు

- Advertisement -

అమెరికా ఉద్యోగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న తన విధానంలో భాగంగా హెచ్‌-1బీ వీసాలపై భారీ ఫీజు ప్రతిపాదనకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతు తెలిపారు. ‘లేబర్‌ డే్ణ సందర్భంగా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా కంపెనీలు విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకునే ముందు దేశంలో ఉన్న వారికి శిక్షణ, ఉపాధి కల్పించేలా ఈ ఫీజు ఉపయోగపడుతుందని చెప్పారు.హెచ్‌-1బీ వీసాలపై 1,03,265 డాలర్ల ఫీజు విధించేలా అమెరికా హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం గత నెలలో ప్రతిపాదించింది. వార్షిక పరిమితిలోకి వచ్చే అన్ని హెచ్‌-1బీ దరఖాస్తులకు ఇది వర్తిస్తుంది. అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ మినహాయింపు కింద వచ్చే దరఖాస్తులు కూడా ఇందులో ఉన్నాయి. దరఖాస్తు సమర్పించే సమయంలోనే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఈ ఫీజు ఇంకా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. ట్రంప్‌ లేబర్‌ డే ప్రకటనతో కంపెనీల నుంచి ఈ మొత్తాన్ని వెంటనే వసూలు చేయడం లేదు.హెచ్‌-1బీ వీసాలను అమెరికా టెక్‌ కంపెనీలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు వీటిని వాడుకుంటున్నారు. హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో తాజా ప్రతిపాదనపై భారత్‌లోనూ ఆసక్తి నెలకొంది.ఈ ప్రతిపాదనకు ముందు ట్రంప్‌ ప్రభుత్వం కొత్త హెచ్‌-1బీ వీసాలపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించింది. దీనిని జూన్‌లో మసాచుసెట్స్‌ ఫెడరల్‌ కోర్టు కొట్టివేసింది. ఈ ఫీజు విధించే అధికారం ప్రభుత్వానికి లేదని కోర్టు పేర్కొంది. జులైలో అప్పీల్‌ కోర్టు కూడా ఆ తీర్పును నిలిపివేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు