జిల్లా క్షయ వ్యాధి మెడికల్ ఆఫీసర్ కె. గాయత్రీ బాయి
విశాలాంధ్ర ధర్మవరం;; అధునాతన పరికరాలతో క్షయ వ్యాధిని నివారించవచ్చునని జిల్లా క్షయ వ్యాధి మెడికల్ ఆఫీసర్ కె గాయత్రీ బాయి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినీయులకు క్షయ వ్యాధి పై అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని తెలిపారు. తదుపరి క్షయ వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, మందులు వాడే విధానాన్ని తెలియజేశామని తెలిపారు. అంతేకాకుండా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స సమయంలో ప్రతినెల ప్రభుత్వం పౌష్టిక ఆహారం కొరకు 6 నెలల పాటు వేయి రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఈ క్షయ వ్యాధికి మొదటి దశలోనే మందులు తీసుకున్న యెడల తొందరగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ విభాగం డిస్ప్రోగ్రం కోఆర్డినేటర్ మల్లికార్జున, నాగేంద్ర, ధర్మవరం అర్బన్ కమ్యూనిటీ ఆర్గనైజర్ లక్ష్మీనారాయణ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, టీవీ సూపర్వైజర్లు, అధ్యాపకులు మల్లికార్జున, కళాశాల విద్యార్థినీలు పాల్గొన్నారు.
అధునాతన పరికరాలతో క్షయ వ్యాధి ను నివారించవచ్చు..
RELATED ARTICLES