Homeజాతీయంతమిళనాడులో టీవీకే సంచలనం.. త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

తమిళనాడులో టీవీకే సంచలనం.. త్రిష రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం తొలి ఎన్నికలతోనే సంచలన విజయం సాధించింది.మొదటిసారి పోటీ చేసిన ఈ పార్టీ 108 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.ఈ విజయంతో పాటు ప్రముఖ నటి త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతుందనే ప్రచారం వేగం అందుకుంది.ఆమె టీవీకే తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో పార్టీ అధినేత విజయ్ రెండు ప్రాంతాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు.పెరంబూర్, తిరుచ్చి తూర్పు స్థానాల్లో గెలిచిన ఆయన, నియమాల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.

విజయ్ వదిలేయనున్న తిరుచ్చి ఈస్ట్‌ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం
స్థానిక కథనాల ప్రకారం ఆయన పెరంబూర్‌ను కొనసాగించి తిరుచ్చి తూర్పును ఖాళీ చేసే అవకాశముంది.
అక్కడ జరగనున్న ఉప ఎన్నికలో త్రిషను అభ్యర్థిగా నిలపవచ్చని సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో త్రిష చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.ఇక టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటంతో, ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రజల దృష్టి కేంద్రీకృతమైంది.అధికారంలోకి వస్తే పెళ్లికూతుళ్లకు ఎనిమిది గ్రాముల బంగారం, కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని పార్టీ హామీ ఇచ్చింది.నిజాయతీతో కూడిన పాలన అందిస్తామని కూడా ప్రకటించింది.

టీవీకే హామీల అమలుపైనే అందరి దృష్టి
అదనంగా ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యార్థులకు ఐదు లక్షల చెల్లింపు శిక్షణ అవకాశాలు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు నాలుగు వేల రూపాయల భృతి, ఉన్నత విద్య కోసం ఇరవై లక్షల వరకు విద్యా రుణాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.ఈ హామీలను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు