డిఎస్పి హేమంత్ కుమార్
పాపిరెడ్డిపల్లి లో జరిగిన హత్య కేసును ఛేదించిన రామగిరి పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం డివిజన్ పరిధిలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో మార్చి 30వ తేదీ జరిగిన ఘర్షణలో మజ్జిగ లింగప్ప మృతి చెందిన కేసును రామగిరి పోలీసులు ఒక్క రోజులోనే చేదించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమంత్ కుమార్ ధర్మవరం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో హత్య కేసు చేదించిన వివరాలను వారు వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 30వ తేదీన జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మజ్జిగ లింగన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదు దారుని కుమారుడు మనోహర్ తన అత్త ఇంటికి వెళుతుండగా నిందితులు ఆదర్శ్ అతని అనుచరులు అతడిని అభ్యంతరంగా హేళన చేయడం జరిగిందని, ఈ విషయం ఫిర్యాదుదారునికి మొబైల్ ద్వారా తెలియడంతో ఆమె భర్త మజ్జిగ లింగన్న (వయసు 55 సంవత్సరాలు తండ్రి లేట్ మల్లప్ప) నిందితులను తన ఇంటి ముందు కూర్చొని ప్రశ్నించడం జరిగిందన్నారు ఈ నేపథ్యంలో ఆదర్శ్, నాయుడు వారి ఇంటికి వచ్చి మజ్జిగ లింగన్నను కట్టెలతో తలపై తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. ఫలితంగా అతనికి తీవ్ర రక్త గాయాలు కావడం జరిగిందన్నారు. గాయపడిన మజ్జిగ లింగన్నను హుటా హుటిన అనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు రామగిరి ఎస్సై మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తును చేయడం జరిగిందన్నారు. ఈ హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు రామగిరి ఎస్సై శ్రీధర్ నేతృత్వంలో డిఎస్పి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం మీద ఈ బృందాలు శ్రమించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అరెస్టు అయిన వారిలో ధర్మవరపు ఆదర్శ్ రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామం, ధర్మవరపు మనోజ్ రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామం అని తెలిపారు. ఈ నిందితులను మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో రామగిరి గ్రామ శివారులోని కరెంట్ ఆఫీస్ వద్ద అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసును విజయవంతంగా సాధించడంలో కీలకంగా వ్యవహరించిన రామగిరి సీఐ శ్రీధర్ను వారి పోలీస్ సిబ్బందిని ధర్మవరం డిఎస్పి హేమంత్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ విభాగం న్యాయంగా నిష్పక్షపాతంగా పనిచేసే నిందితులను అరెస్టు చేయడంలో నిరంతరం కృషి చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగిరి సీఐ శ్రీధర్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.