విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణానికి చెందిన ప్రముఖ జానపద గాయకురాలు సోమిశెట్టి సరళకు 2025 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉగాది పురస్కారం ప్రకటించబడింది. ఈ సందర్భంగా సరళ మాట్లాడుతూ తిరుపతి సిటీ ఛాంబర్ వారు తమ 28వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాలలోని విశిష్ట సేవలను అందించిన వారికి 2025 సంవత్సరముకు గాను ఉగాది పురస్కారాలు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ పురస్కారాలలో కళా రంగానికి చెందిన ధర్మవరం పట్టణంలోని సోమిశెట్టి సరళ గా తాను ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఈనెల 27వ తేదీ తిరుపతి తిరుమల దేవస్థానం వారి సౌజన్యంతో తిరుపతి పట్టణంలోని మహతి ఆడిటోరియంలో జరగబోవు వేడుకల్లో తాను ఈ పురస్కారం అందుకోనున్నట్లు వారు తెలిపారు. ఇందు కాను తనకు ఆహ్వానం కూడా అందినట్లు వారు తెలిపారు. ఈ పురస్కారాల సభకు ముఖ్య అతిథులుగా అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ శాఖ మంత్రి, తిరుపతి ఎమ్మెల్యే అరాని శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే తిరుపతి సుగుణ, మోహన్, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కళాకారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుడు అందరూ సరళకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
సోమిశెట్టి సరళకు ఉగాది పురస్కారం..
RELATED ARTICLES