Tuesday, April 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంయూజెఏసీ ర్యాలీలో పాలస్తీనా ఫ్లాగ్ వివాదంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు యూజెఏసి నాయకుల వినతులు

యూజెఏసీ ర్యాలీలో పాలస్తీనా ఫ్లాగ్ వివాదంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు యూజెఏసి నాయకుల వినతులు

విశాలాంధ్ర -అనంతపురం : కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు వివాదంపై అనంతపురం పట్టణంలో నిర్వహించిన యునైటెడ్ జేఏసీ ర్యాలీలో పొరపాటున ఇద్దరు యువకులు , పాలస్తీనా ఫ్లాగ్ ప్రదర్శించడంపై వివాదం చోటు చేసుకోవడంతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణకు మంగళవారం యునైటెడ్ జేఏసీ నాయకులు సిపిఐ సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఇన్సాఫ్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజా హుస్సేన్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ర్యాలీలో పొరపాటున పాలస్తీనా ఫ్లాగ్ ప్రదర్శించడం జరిగిందన్నారు. దీనిపై బిజెపి స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. యునైటెడ్ జేఏసీ నాయకులు విషయంపై పాలస్తీనా ఫ్లాగ్ ను ప్రదర్శించిన వ్యక్తులను విచారించడం జరిగిందన్నారు. వారికి ఎటువంటి మతద్వేషాలు రెచ్చగొట్టే ఆలోచన లేదని పొరపాటు జరిగిందని వారు తెలియజేశారన్నారు. ఈ విషయంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందిస్తూ డీఐజీ తో మాట్లాడతానని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శి అల్లిపీరా మసూద్, జిలాన్ , హాజీవలి, జమాతే ఇస్లామీ హింద్ యాసిర్, హాజిపిరా తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు