Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాపోలీసులకు యూనిఫామ్ అందజేసిన ఉమ్మినేని విక్రమ్

పోలీసులకు యూనిఫామ్ అందజేసిన ఉమ్మినేని విక్రమ్

- Advertisement -

విశాలాంధ్ర నందిగామ: – అన్ని సమయాలలో తాము ఒక సాధారణ మనుషులమని మరిచి ప్రజలకు సేవలు అందించుటలో పోలీసుల సేవలు అనిర్వచనం అని తెలుగుదేశం పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ ఉమ్మినేని విక్రమ్ అన్నారు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు సిఐ వై వి వి ఎల్ నాయుడు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా పోలీసులకు యూనిఫామ్ ను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి చెడులతో సంబంధం లేకుండా అన్ని సమయాలలో ప్రజలకు రక్షణగా ఉంటూ ప్రజారక్షణ తమ జీవిత లక్ష్యంగా పనిచేసే ఏకైక వృత్తి పోలీస్ వృత్తి అని కొనియాడారు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ రోజు పోలీసులకు తన దాతృత్వంలో యూనిఫామ్ బహూకరించడం జరుగుతుందని అందులో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ యూనిఫామ్ క్లాత్ ను ఆయన స్థానిక పోలీస్ అధికారులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా సిఐ వైవి విఎల్ నాయుడు మాట్లాడుతూ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తూ తన దాతృత్వంలో సిబ్బందికి యూనిఫామ్ అందజేయటం ఎంతో గర్వకారణమైన సంఘటనని అన్నారు గత సంవత్సరం కూడా సిబ్బంది మొత్తానికి యూనిఫామ్ విక్రమ్ అందజేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు