Tuesday, April 1, 2025
Homeజిల్లాలుఅనంతపురంక్షయ వ్యాధి సంక్రమణ పరీక్ష పై అవగాహన

క్షయ వ్యాధి సంక్రమణ పరీక్ష పై అవగాహన

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయం లో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి క్షయ వ్యాధి సంక్రమణ పరీక్ష , సి వై – టీబీ చర్మ పరీక్ష ( క్షయ సోకిన రోగి తో పాటు నివసించే వ్యక్తులకి చేయు పరీక్ష ) ని ప్రారంభించి ఈ పరీక్ష గురించి అవగాహన కలిగించారు, క్షేత్రస్థాయి లో ఈ పరీక్ష ని సమర్ధవంతగా అమలు ఆయ్యేవిధంగా చూడాలని ఆదేశించారు, ఈ కార్యక్రమము లో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారిని డాక్టర్ అనుపమ జేమ్స్ మాట్లాడుతూ… క్షయ ని నిర్ములించే కారక్రమములో భాగంగా భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ఈ పరీక్ష చాల ఉపయోగపడుతుంది అని తెలియ చేసారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ… ఈ పరీక్షలో సంక్రమణ నిర్ధారణ అయితే టీబీ జబ్బు రాకుండ ముందస్తుగా వాడే మందులని ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అని తెలియచేసారు. ఈ కార్యక్రమములో జిల్లా క్షయ వ్యాధి నివారణ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు