కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం:: చేనేత సమస్యలు పరిష్కారం కావాలి అంటే ఐక్యతతో పాటు సమన్వయం కూడా ఎంతో అవసరమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని శనినారాయణ స్వామి దేవాలయంలో ధర్మవరం పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం చేనేత పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ప్రభుత్వ చేయూత కూడా ఎంతో అవసరమని వారు తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు తప్పకుండా రూపొందించుకోవాలని తెలిపారు. రావలసిన బకాయిల విషయంలో అందరూ ఐక్యమతముతో వెళ్లినప్పుడే సొమ్ము తప్పకుండా వస్తుందని తెలిపారు. బెదిరింపులకు, భయాందోళనకు ఎవ్వరు కూడా లొంగరాదని తెలిపారు. లీగల్ టీం ఏర్పాటు చేసుకుంటే మంచిది అని వారు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను కమిటీ వారు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు గిర్రాజ రవి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు, జాతీయ చేనేత నాయకురాలు జయశ్రీ, హేమంత్ కుమార్, గుద్దుటి రాము, దాసరి వెంకటేశులు, గడ్డం శ్రీనివాసులు, శ్రీరాములు, కుల్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
చేనేత సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్యత, సమన్వయం ఎంతో అవసరం..
RELATED ARTICLES