భారత్ – యూరప్ వాణిజ్య ఒప్పందం ( India – EU FTA)పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం తమను తీవ్ర నిరాశపరిచిందని తెలిపింది. ఉక్రెయిన్ ప్రజల కంటే కూడా యూరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నామని ఈయూ ఒకవైపు చెబుతూనే.. మరోవైపు రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు పరోక్షంగా ఆర్థికసాయం చేస్తున్నాయని తెలిపారు. ఇది పూర్తిగా ద్వంద్వ వైఖరి అని విమర్శించారు. భారత్‌తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ద్వారా యూరప్ దేశాలు తమ వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేసినట్లు అర్థమవుతుందని తెలిపారు. వాళ్లు తమకు ఏది మేలు అనిపిస్తే అది చేయాలి.. కానీ యూరప్ వైఖరి నన్ను తీవ్ర నిరాశకు గురిచేసిందని వ్యాఖ్యానించారు.
యూరప్ దేశాలు రష్యా నుంచి నేరుగా చమురు కొనుగోలు చేయకపోయినా.. భారత్‌లో శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయని బెసెంట్ తెలిపారు. రష్యా చమురు భారత్‌కు వస్తోంది.. అక్కడ శుద్ధి అయ్యాక యూరప్‌నకు వెళ్తున్నది.. అంటే పరీక్షంగా యూరప్ రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చుతున్నట్లే అని తెలిపారు.
భారత్- ఈయూ ట్రేడ్ డీల్.. మమ్మల్ని నిరాశపరిచింది: అమెరికా
- Advertisement -
RELATED ARTICLES


