Homeక్రీడలుకోహ్లీని వైభవ్ అవమానించలేదు: హర్ష భోగ్లే

కోహ్లీని వైభవ్ అవమానించలేదు: హర్ష భోగ్లే

- Advertisement -

వైభవ్ పై ఫేక్ వీడియో కలకలం
న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. అది ఫేక్ వీడియో అని హర్ష భోగ్లే వివరణ ఇచ్చాడు. ఆ వీడియోలో వైభవ్…టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని అవమానించేలా మాట్లాడినట్లు ఉంది. విరాట్ గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఒక ప్రశ్న అడిగితే.. కోహ్లీ చాలా నెమ్మదిగా ఆడతాడంటూ వైభవ్ దానికి సమాధానం ఇచ్చినట్లుగా చూపించారు. ఈ వీడియోపై హర్ష భోగ్లే ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఆ వీడియోలో వాస్తవం లేదని, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేశాడు. ‘వైభవ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో క్లియర్‌గా ఫేక్. అందులో వైభవ్‌ను మర్యాద తెలియనివాడిగా, అహంకారిగా, అసభ్యంగా చూపించే ప్రయత్నం చేశారు. నేను అతడిని ఆ ప్రశ్న అడగలేదు. అతడు కూడా అలాంటి సమాధానమేదీ ఇవ్వలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియోను క్రియేట్ చేశారు. ఎంతో వినయంగా ఉండే ఓ యువ క్రికెటర్‌పై ఇలాంటి తప్ప్పుడు ప్రచారం చేయడం దారుణం’ అని హర్ష భోగ్లే పేర్కొన్నాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు