ఆలయ కమిటీ అధ్యక్షురాలు, సంకారపు జయ శ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ ఆధ్వర్యంలో భక్తాదులు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ కమిటీ, భక్తాదులు, దాతల పేరిటన ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సంకారపు జయ శ్రీ మాట్లాడుతూ పట్టణంలో 600 సంవత్సరాల క్రిందట వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మానం అవుతుందని, ప్రస్తుతం కమిటీ వారు దాతల సహాయ సహకారముతో నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి భక్తుడు తనకున్న దానిలో ఆలయానికి వస్తురూపేనా నగదు రూపేనా ఇవ్వాలని వారు కోరారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావాలంటే దాతలు మరింత ముందుకు రావాలని వారు విన్నవించుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్తర ద్వారం తరపున భక్తాదులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో గడ్డం పార్థసారథి, డాక్టర్ నరసింహులు, అంబటి అవినాష్, అజంతా కృష్ణ ,పుట్లూరు నర్సింహులు, జయప్రకాష్, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానములో వైకుంఠ ఏకాదశి వేడుకలు..
RELATED ARTICLES