సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు
విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ పెట్రోల్ బంకు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనగా కాలు విరిగిన బాధితున్ని తమ సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి వందేమాతరం టీం సభ్యులు మానవత్వాన్ని చాటారు. ఈ ప్రమాదంలో మోటు చింతమాను తాండా కు చెందిన తులసి నాయక్ కాలు విరగ్గా మరొక బైక్ లో వెళ్తున్న ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదమని తెలిసినా, ఏదైనా సహాయం చేయాలన్నా తమ దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి సహాయం చేయడమే గాక వారి ప్రాణాలను కాపాడే వందేమాతరం టీంకు మండల వాసు లేక కాక తదితరులుకృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మానవత్వం చాటుకున్న వందేమాతరం టీం
RELATED ARTICLES