చలివేంద్రo ప్రారంభించిన ఎస్సై
విశాలాంధ్ర- తనకల్లు : మండలంలో అనేక సేవా కార్యక్రమాల్లో ముందుoటూ సమాజానికి ఆదర్శంగా వందేమాతరం టీం నిలుస్తుందని ఎస్సై గోపి తెలిపారు మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో వందేమాతరం టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాన్ని ఎస్ఐ గోపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందేమాతరం టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు వారు స్పందించే తీరు యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో వారి పాత్ర అమోఘమని ఈ మండలంలో ఇలాంటి టీం ఉండడం ఈ మండల ప్రజల అదృష్టం అన్నారు.వేసవి తాపానికి పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేసిన వందేమాతరం టీంకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానన్నారు .వరుసగా నాలుగవ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని ఏర్పాటుచేసిన వందేమాతరం టీంకు గ్రామ ప్రజలతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వందేమాతరం టీం సభ్యులతో పాటు పలువురు పాల్గొన్నారు.