Wednesday, May 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంస్నాతకోత్సవము విజయవంతం పై వీసీ, రిజిస్ట్రార్ హర్షం ..

స్నాతకోత్సవము విజయవంతం పై వీసీ, రిజిస్ట్రార్ హర్షం ..

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ 14 వ స్నాతకోత్సవము విజయవంతం పై ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు.. బుధవారం ఉపకులపతి కాన్ఫరెన్స్ హాల్లో డైరెక్టర్లు, వివిధ కమిటీల కన్వీనర్లు, మెంబర్లు, కళాశాల ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్, భోధన సిబ్బంది , భోధనేతర సిబ్బసిబ్బంది సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రతి ఉద్యోగి సహకారం ఉందని, అందరి తోడ్పాటుతోనే ఇది విజయవంతమైందని తెలిపారు. ప్రత్యక కమిటీలు వేసి ఎటువంటి సమస్యలు రాకుండా స్నాతకోత్సవము నిర్వహించామన్నారు. ఈ స్నాతకోత్సవాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారిక యంత్రాంగానికి, పోలీసు శాఖ , విశ్వవిద్యాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, అధ్యాపక బృందం, విశ్వవిద్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు