కడియం మండల టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని
విశాలాంధ్ర – కడియం : ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ, ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా పాత్ర సమాజంలో ఎంతో కీలకమని కడియం మండలం టిడిపి అధ్యక్షులు వెలుగుబంటి నాని అన్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా కడియం ప్రెస్ క్లబ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ విలువలు కలిగిన జర్నలిజంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వార్తా సేకరణలో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కడియం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిక్కాల సూరిబాబు, సీనియర్ జర్నలిస్టులు బెజవాడ గౌరీ శంకర్, దూడల అర్జున్, అన్నందేవుల సూర్య చంద్రరావు, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ, కొప్పిశెట్టి సుబ్రమణ్యం, శెట్టి పోసిబాబు, పళ్ళ వెంకటగిరి , యడ్ల నరేష్, కొప్పాక రమణ తదితరులు పాల్గొన్నారు.


