Tuesday, April 22, 2025
Homeఆంధ్రప్రదేశ్ఏపీ లిక్క‌ర్ స్కామ్‌పై విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్

ఏపీ లిక్క‌ర్ స్కామ్‌పై విజ‌య‌సాయిరెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్

లిక్క‌ర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయ‌ర్‌లాంటిది..
మ‌ద్యం కుంభ‌కోణం దొంగలను బయటకు ర‌ప్పించ్చేందుకు సహకరిస్తానన్న‌ మాజీ ఎంపీ

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై కూట‌మి ప్ర‌భుత్వం సిట్ ద్వారా విచార‌ణ జ‌రిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురిని సిట్‌ ప్రశ్నించింది కూడా. అలాగే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షిగా సిట్ అధికారులకు త‌న వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఈ స్కామ్‌పై ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయ‌ర్‌లాంటిదని ట్వీట్ చేశారు. ఇందులో నుంచి తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని ఆరోపించారు. మ‌ద్యం కుంభ‌కోణం దొంగలను బయటకు రప్పించేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని మాజీ ఎంపీ తెలిపారు. ఏపీ మ‌ద్యం కుంభ‌కోణంలో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయీ నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తానుఁ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో పోస్ట్‌ చేశారు. కాగా, లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత సాయిరెడ్డి ఈ ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఈ లిక్క‌ర్‌ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ అంతా కూడా కసిరెడ్డే అని విజ‌య‌సాయిరెడ్డి ఇటీవ‌ల వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు